పువ్వు

వసంతపు పువ్వా
చిందులు వేస్తావు
పరిమళమే నువ్వా
తోటంత పసరావు

గువ్వలు వాలి
గమ్మత్తు చేసేను
చల్లని ఈ గాలి
దోబూచులాడేను

సిరివెన్నెలలే
నీ మెరుగును పెంచె
నక్షత్రమాలలే
నీకు పోటిగ నిలిచె

తుమ్మెదలు వచ్చెనె
సుధలడగగా
నీ రెక్కలు విచ్చెనె
ధారాళముగా

అందమైన పువ్వా
వర్ణాల కొలువీవు
చక్కని నవ్వా
తెచ్చేవు ఛవి నీవు!