తేటగీతి
- Roopa Rani Bussa
- Jan 10
- 1 min read

ప్రముఖ కవులు, పద్యాలను మూడు విధాలుగా చెప్పారు.
౧. వృత్తములు అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల మొదలైనవి. ౨. జాతులు అంటే కందము, ద్విపద మొదలైనవి. ౩. ఉప జాతులు..తేటగీతి, ఆటవెలది, సీసము.
తేటగీతి - ఉపజాతి పద్యాలకు చెందినది
లక్షణాలు-
ఆ."సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరుదినకరద్వయంబు తేటగీతి"
తే.గీ.
దిశను మార్చిన సూరీడు దివిని జూపె
జాపి హస్తాలు వెచ్చగ జగతి నిలిపె
నెలవు రవంత నిత్యము నేల మీద
మిత్ర! వసుధకు వరముగ మించినావు
వచ్చె ఫలములు కాలపు వరుల పంట
ఎద్ల పూజతో పండుగ ఏట మెరిసె
ధాన్య రాశిని వందించి దానమిచ్చి
క్షేత్రి సాముకు మనమిచ్చు క్షేమస్వస్తి
గాలిపటములు గగనపు గమథమంత
ఇంటి ముంగిట మచ్చటైన ఎసల ముగ్గు
క్రొత్త జంటకు సంక్రాంతి కోటిదివ్వె
భోగి మంటలు తెచ్చును భోగసిరులు
తే.గీ.
మోక్ష మార్గము జూపెను మోహనుండు
జగతి పొందెను జ్ఞానము జయము చేత
నిత్య జీవనమునకది నీతి వాణి
శుభమునందించు భాగ్యమీ శృతికీర్తి
తే.గీ
కవుల రచనలు తెలిపెను గాఢ విత్తి
చదివితె బదులుగ దొరకును జ్ఞాన మిన్న
నిత్య జాగృతి నందించి నిగ్గు తెచ్చె
నన్ని ప్రశ్నలకు పొసఁగు నుత్తరములు
తే.గీ.
మదికి విందుగ తలఁపుకు దీవెనలుగ
భావనల పులకింతకు పదములొసగ
నూసుల పరవశాలకు నూగిపోయె
తారలతొ కప్పిన నిశను తాకి వచ్చె
తే.గీ
రమ్యమైన దృశ్యాలను రంగరించె
పచ్చ పచ్చని సొగసును పదును పెట్టె
పూల అందచందాలను పులకరించె
పవన మలయమును కవిత పైడి జేసె
తే.గీ.
సృష్టికర్తను స్తుతియించు సాధనముగ
జ్ఞాన జ్ఞేయము జెప్పెడి జాణ తానె
శబ్ద సంపుటిని తెరచి యిన్ని జెప్పె
కావ్య మధువనిలో పిక కవన వాణి
తే.గీ
పరువపు లయలొ మనస్సు విరులు విరచి
తలఁపు మదినేగు తరుణపు హొయలొ బూనె
ప్రీతి వాంఛలు కలలుగ పొందు పడుచు
నేదొ హాయిలో కలిగెను మైదు జాను
తే.గీ
ఎగిసె అలలకు అలుపేది ఎలము నిచ్చ
చూచు కనులకు కమ్మని విందు అందు
నురుగు కెరెటము తీరమును నుసలు వేళ
మనసు మకురము తిలకించె మధుర చారు
Comments