#ధ్యేయం
దృఢంగా ఉంచు నీ ధ్యేయం
చేస్తూ ఉండు నీ ప్రయత్నం
ఆగనీయకు నీ పోరాటం
రానే వస్తుంది విజయ ఘట్టం
#విద్య
నేర్చిన విద్య విలువైనది
చేర్చుకో ఆ పెన్నిధి
నీ జ్ఞానమే నీ ప్రతినిధి
మరి తోడు రాదు వేరేది
#గెలుపు
ఆశయమే ఊపిరై
ప్రయత్నమే పట్టుదలై
సాధనే ఇంధనమై
సాధించు ప్రతి ధ్యేయం
ఎగరవేస్తుంది విజయ పతాకం.....
#నవ్వులప్రపంచం
ఉన్నదొక్క జీవితం
సంతోషంలోనే ఉందండి సుఖం
తెలుసుకొని మసలుదాం
ఆనందం పంచుకుందాం
సరదాగా గడిపేద్దాం
తనివి తీరా నవ్వుదాం
నవ్వుతూ అందరినీ నవ్విద్దాం
రండీ దయచేయండి ఇదిగో నవ్వుల ప్రపంచం..
#తోడు
తొందరపడి నిర్ణయించకు ఒంటరివాడివని
తెలుసుకో అంతర్భావాలు నిను వీడని తోడని
పోల్చుకోకు నీ పరిస్థితి మరొకరి స్థితులతోనని
నీ భావనలను ఎన్నడు ఒంటరిగా వదలబోకని
తెలుసుకో ఈ సృష్టిలో ఎవరు ఒంటరివారు కారని
నిన్ను నీవు ప్రేమించుకున్నపుడు జగమంతా
నీ వెంట ఉంటుందని…
మరువకు నేస్తం
#జీవితం
చిన్నతనంలో అనుకుంటాం స్నేహమే జీవితమని
వయస్సు వచ్చాక అనుకుంటాం ప్రేమే జీవితమని
పెళ్ళయ్యాక అనుకుంటాం భార్యా పిల్లలే జీవితమని
మధ్య వయస్సులో అనుకుంటాం బాధ్యతలే జీవితమని
వృద్ధాప్యంలో అనుకుంటాం ఆరోగ్యమే జీవితమని
పరిస్థితుల ప్రభావంతో జీవితపు దృష్టి కోణం మారుతుంది
ఎప్పటికీ తను నొప్పి పడక ఇతరులను నొప్పించక గడిపిన జీవన ఘడియలే అమోఘం!
#మాతృభాష
ఆంగ్లేయుల ప్రభావం ఆంగ్లభాష వ్యామోహం
వెలగనివ్వలేదు మాతృభాష చందం
మాతృభాష మాట్లాడితే చిన్నచూపు చూస్తారు
ఆంగ్లంలో పరిపక్వత పొందితే ఘనుడని అంటారు
మాతృభాషకు మాత్రం దూరమైపోతోంది లోకం
మరో భాష అందుకోలేక ఊభిలో పడింది ప్రజానీకం
#ఆత్మవిశ్వాసం
గాయపడిన మనస్సుకు కావాలి ఏకాంతం
మనోబలంతో వికసించగలదు మరో పుష్పం
మార్గంలో చూడగలం పులకింతల వసంతం
నిరాషా నిస్పృహలు జీవితపు భాగం
ఋతు చక్రాలతో దొరలుతుంది క్లిష్ట క్షణం
ఆత్మవిశ్వాసంతో పాడు నూతన రాగం
#భావం
కల్పనకు అతీతమైనది మనస్సు
భావాలకు అతీతమైనది ప్రేమ
సంతోషానికి అతీతమైనది చిరునవ్వు
చెలిమికి అతీతమైనది ఆత్మీయత
#సూక్తి
ఉత్తమ వ్యవహారం
తీయని పలుకుల అనురాగం
మన,తన అనబడే ప్రేమ భావం
ఆప్యాయతల ఆలింగనం
పరులకు ఉపయోగ పడే ఆశయం
గుణగణాలకు అనుకూలించే స్నేహ భావం
ఇవన్ని మనం నేర్చుకున్న పాఠం
ప్రతి గ్రంథం మనకిచ్చిన సందేశం
వేదాలు దానికి సాక్షం
వేదవ్యాసుడు మలచిన సభ్యతా సంస్కారం అజరామరం...
పాటిస్తే మేలు కల్గును సమస్త భూమండలానికి
ఆ చంద్రతారార్కం
#పువ్వులునవ్వులు
పువ్వుల పొదరిల్లు
మువ్వల సంబరాలు
గువ్వల కిచకిచలు
నవ్వుల లోగిళ్ళు
సవ్వడుల తరంగాలు
Comments