top of page
Writer's pictureRoopa Rani Bussa

‘పూలతిలకా గీతిక’ ప్రక్రియ


#గంగ

నాటియమాడుతు

జటిలో ఒదిగి

ఝరియై భువికి జారెను

ఫలియించెను భగీరథుని ప్రయత్నము

గంగావతరణతో


#చీకటి

కమ్మినగాని చింత వలదు

కదులు కాలము మనకు వరము

తిమిరమును తరుముతు రానే వచ్చును

ప్రభాతము


#మంచి

ఎక్కడో మూలలో దాగుంది

దానికి ఆయువెక్కువుంది

పాపం! అనేక కష్టాలు ఎదిరిస్తూనే

బ్రతుకుతున్నది


#చేపలు

ఎప్పుడు నీటిలోనే ఉన్నప్పటికి బయట తీస్తే

బొట్టు నీరైనా నిలవదు దాని ఒంటిపైన

సహజముగ సమాజములో మసలు విధము

తెలుపుతున్నది


#చేరిస్తే

ఒక్కో చుక్క

అనంతమగును సమయముతోన

మరి చేర్చడం మొదలు పెట్టడమే

ఆలస్యము


#అన్వవేక్షలు!

లక్షలగును క్షణములో

చెలరేగును భావాలలో

కదులుతూ ప్రతి కోణములో

గరళామృతములై


#విశ్వం!

వింతల అనంతం

అద్వితీయ సౌందర్యం

అంతే భయానకం

చేతనం


#ప్రణయం

తెలియని కోలాహలం

అనూహ్య పేమాలపం

ఇరువురి ఏకాంతం

మనోహరం


#ప్రతిన

చేయాలి మనసుతోన

నిలవాలి మాట పైన

ఎలాంటి ఒడిదుడుకుల్లోనైన

ఎప్పటికైన


#ప్రతిజీవి

భువిలో పుట్టాక

చేయాలి తన కర్తవ్యం

లేకపోతె మన గతి

అధోగతి


#ప్రేమ

పంచు కొంతైన

బంధం ఏర్పడుతుంది ఎవరితోనైన

అనుబంధానికి లొంగని వారెవరు

లోకంలోన!


#ధర్మ

పాలన అతి ముఖ్యం

అని చెబుతుంది భగవద్గీత

ఆ ఒక్కటి చేస్తే చేరెదము

స్వర్గం

24 views0 comments

Commentaires


Post: Blog2_Post
bottom of page