ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
ఏ పాటను విన్నా, రాగాలెన్ని వినికిడిన
భరతమాత గొంతుకు వేరేది సాటి లేదురా
స్వర్గ సీమనీదని, దేవలోక ముక్కయని
ప్రేమలు పంచగా, బంధాలతో ముడిపడి
ఆదరించే తల్లి రా పుణ్యభూమి నీదిరా
యోగము నీదని, గర్వముతో రొమ్ము తట్టరా
భాగ్యము నీదని, పొగడరా నీ దేశ మాతని
విస్తారం విశాలంగ, సూర్యతేజము సంపూర్ణంగా
ఋతువుల లీలతో, సస్యశ్యామలం పదిలంగా
ఆరోగ్యకరమైనదిగా, వాతావరణ అనుకూలంగా
గంగ,యమునతో, నీళ్ళ పరుగులు వరుసగా
కిన్నెరసాని అందంగా అద్వితీయం తన రూపురా
భాషలన్ని స్పూర్తిగా, కవితలకు ఆలయముగా
సంస్కృతికి నాందిగా, దైవావతరణలు సాక్షిగా
భారతి సంపుటగా, జ్ఞానానికి ఎత్తినచేయిగా
రాయవారి ప్రతిష్టరా,రారాజులు ఏలిన దేశమురా,
నీ దేశ ఉన్నతమైనదిరా, నీదు యోగమును గ్రహించరా
ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
ఏ పాటను విన్నా, రాగాలెన్ని వినికిడిన
భరతమాత గొంతుకు వేరేది సాటి లేదురా
————-*******————-*******———
రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిన ఏదేశమేగిన గేయము స్ఫూర్తిగా నేను వ్రాసిన గేయం
Chalabhagundi Roopa 👌👏