చిరునవ్వు
చిరునవ్వుల మల్లెలు,
వెదజల్లును ప్రియమైన పరిమళము
నవ్వుల సుధ ప్రోక్షణలు,
దివినుండి దిగిన సింధుజము
రవికిరణాలవలె ఓజస్వితము,
చమత్కారపు చిరు మందహాసము
ఔరా! అనన్య లాస్యం, మనోజ్ఞమైనది ఈ స్మితము
స్వప్నంవిజయం
నీ స్వప్నం అయితే నీ నీడ
నీ విజయం అవుతుంది నీ ఓడ
ద్వేషం
ఎందుకు ద్వేషం
దానితో ఆరోగ్యం క్షీణం
జరగవచ్చు మారణహోమం
మిగలకపోవచ్చు మరి శేషం
అది మనకు విషం
అందుకే వలదు రోషం
ఎల్లప్పుడు పంచుదాం సంతోషం
దృష్టి
చూసే దృష్టి మార్చేదాకా కలగదు ఏ మార్పు,
చిందించు హృష్టి అందే దాక మార్చు నీ దృష్టి
సూక్తి
తలయూచు సంభ్రమంలో పాడకు బాసల పాట
కోపతాపాల చిందఱగొను వేళ అనబోకు ఏ మాట
భయాందోళనలు కమ్ముతున్న పూట ఆడకు ఏ ఆట
యుక్తితో చేయు కార్యాలు మనకగును సిరిసంపదల మూట
దురాశ
ఒకనాడు చావు తప్పదని తెలిసినా ఎందుకు మనుషులకు ఆశల ప్రేతం..
ఎంత డబ్బు ఉన్నా కలగదు కదా తృప్తి,
ఏమిటీ కీలకం
మృగాలు సహితం కడుపు నిండాక వదిలి వెళతాయి తమ ఆహారం..
కావద్దు అడవిమృగాలకన్నా హీనం,
వాటికన్న మనుషులకుంది ఎక్కువ జ్ఞానం..
అందుకే మనిషి వలే ప్రవర్తించు బ్రతికించు మానవత్వం...
మరవకు దురాశ దు:ఖానికి మూలం అని పెద్దలు చెప్పిన పాఠం..
తృప్తి
పగలు రేయి పనిచేసినా దొరకని ఆనందం
శక్తినొసగి చమటోర్చిన కలగని సంతోషం
శ్రమించు వైఖరిలో పొందలేని సంతసం
మనస్సు ఉంచి, ఆత్మవిశ్వాసంతో చేయు పనిలో
చూడగలం తృప్తికరమైన ఆనందం
లాఘవము
చేయు పనిలో ఉంటే లాఘవము
ఫలితము కనిపించును కరతలము
విశ్వాసపు పనితనమే మనకగును
విజయ ఆయుధము
అందంఆనందం
కిన్నెరసాని అందం
పచ్చ పైర్లు కళకళలాడు వైభోగం
కూనలమ్మ ఆనందం
కమ్మని వెంకి పాటల నవనీతం
కడతెగని బంధం
అన్యోన్నతల చిరకాల వసంతం
ఆటలుపాటలు
చంటితనపు ఆటలు
చిలిపి పలుకుల పాటలు
పెంకితనపు చేష్టలు
తడబడపు నడకలు
బిత్తరపడు చూపులు
గలగలపు నవ్వులు
పసి బిడ్డల రువ్వులు
చేరబడు పువ్వులు
సూక్తి
చాతుర్యం సంసిద్ధం
సహనానికి నిలయం
మాటలు మాధుర్యం
పనిలో చాకచక్యం
పకృతిలో హుందాతనం
చక్కని మందహాసం
తల్లితనానికి ఉండవలసిన సద్గుణం
బంగారు బాటకు ఆశీర్వచనం
నా తల్లి నాకు నేర్పిన జీవన మకరందం
ప్రేమనే పంచు ఎల్లకాలం
సహనం
నిరీక్షించు ప్రతి క్షణం, ప్రమాణంచు నీ సహనం
పరీక్షించు ప్రతి క్షణం, నిరూపించును నీ ఔదార్యం
ఏకాగ్రత
ధ్యానం,జపతపాల ప్రసిద్ధం,
ఏకాగ్రత అభివృద్ధి చేయు మార్గము
యోగభోగాల సంసిద్ధం,
ప్రయత్నాల పట్టుదలతో ప్రభవించిన సన్మార్గం
ఏకాగ్రతతో ప్రయత్నించు ప్రతి కార్యంలో గాంచెదవు విజయం
జీవనవిధి
శ్రమించిచేయు పనిలో పొందు తృప్తిని
చులకనగా చూడకు ఎటువంటి పనిని
అసూయ కుప్ప కూల్చును మన ఎదుగుదల గతిని
పరిహసించిన యడల మన జీవనం గతి
అవుతుంది అదోగతి అని
జీవన విధి నిర్ణయించిన క్రమమే మన జీవనోపాధి,
మరవకు ఆ సంగతిని
ప్రకృతివికృతి
గంభీరమైన కడలి విస్మయ దృశ్యాల సౌందర్యానికి లోగిలి
ఆగ్రహించిన కడలి ఆకృతి మారిన గందరగోళపు దాడి
అందమైన శాంత స్వరూపం, విజృంభిస్తే దాల్చును విశ్వరూపం
ప్రకృతిని కెలకడం అంటే కొనితెచ్చుకొనే వికారం
వరిష్టులు
పెద్దల అనుభవాలు మనకు నేర్పుతాయి సాధనకు మార్గం
గౌరవించు వరిష్ఠులను, చులకనగా చూడకు వారి శోధనం
తృష్ణించి సాధించాలి మనం, మదిని తలచి చేరాలి గెలుపుల శిఖరం
చూస్తూ ఉండగా మాయమైపోతుంది యవ్వనం
కాలం ఆగదు కదా మన కోసం
విధి
పాప పుణ్యాలను లెక్క కట్టును విధి
మరవబోకు నీ మితి
లేనిచో రావచ్చు మెతుకు అన్నం
గుటుకు నీళ్ళకు సహితం
నోచుకోని స్థితి
Commentaires